జూన్ 27, 2026

IMG 20241103 WA0044

TRINETHRAM NEWS

ఆసరా పింఛన్ దారుల పింఛన్ పెంపు కోసం నవంబర్ 26న చలో హైదరాబాద్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో గల R & B గెస్ట్ హౌస్ లో వికలాంగుల హక్కుల పోరాట సమితి (VHPS) జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జిల్లా అధ్యక్షులు శ్యాం ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కాళ్ళ జంగయ్య పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వికలాంగులకు 6000 వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు చేనేత గీత కార్మికులకు బీడీ కార్మికులకు 4000 రూపాయలు పెన్షన్ పింఛన్ పెంచుతామని చెప్పి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆసరాపింఛన్దారులనుమర్చిపోవడంవిడ్డూరంగాఉందనిఎద్దేవాచేశారు. పక్క రాష్ట్రంలో వికలాంగుల పెన్షన్ వృద్ధుల వితంతుల పెన్షన్ పెంచితే బంగారు తెలంగాణలో మాత్రం పింఛన్ పెంచకపోవడం పింఛన్ పెంచకపోవడం ఏమిటని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ లో ఆసరా పింఛన్.పెంచిప్రతినెల1వతారీఖునే ఇంటింటికివెళ్లిపింఛన్లుఇవ్వడం జరుగుతుంటే తెలంగాణలో మాత్రం 30వ తేదీ జరిగిన పెన్షన్స్ అందజేస్తే లేరంటే ఆసరా పింఛన్దారుల మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. కనుక పింఛన్లుపెంచమనికనీసంప్రతిపక్షాలైన ఆసరా పింఛన్దారుల పక్షాన పోరాటం చేస్తారని అనుకుంటే వారు కూడా పించన్ దార్ల పక్షాన నిలబడక పోవడం విడ్డూరంగా ఉందని తెలిపారు ఆసరా పింఛన్దారులకు అండగా ఉండి పోరాటాన్నిముందుకుతీసుకెళుతున్న ఏకైక వ్యక్తి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ మొన్నటికి మొన్న హైదరాబాదులో ప్రెస్ మీట్ పెట్టి పింఛన్లుపెంచకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై తాడోపేడో తెలుసుకోవడం కోసం ఉద్యమ కార్యచరణ ప్రకటించారు *నవంబర్ 1 నుండి 16 వరకు అన్ని జిల్లాల సదస్సులు నిర్వహించి నవంబర్ 17 నుండి 23 వరకు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే లక్షలాది మందితో నవంబర్ 26న చలో హైదరాబాద్ చేపట్టి తీరుతామనిహెచ్చరించారు నవంబర్ 11న వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఐదు వేల మందితో ఆసరా పింఛన్దారుల మహాసభను నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రచార కార్యదర్శి చిట్టి రాజు . సహాయ కార్యదర్శి విజయ్ కుమార్. జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లరాజు. జిల్లా నాయకులు కే రాములు గోరయ్య. రమణ చారి. హుస్సేన్ బి. శేఖర్. తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page