-రానున్న స్థానిక ఎన్నికలలో విజయం కాంగ్రెస్ పార్టీదే….
కూకట్ పల్లి నవంబర్ 14 (త్రినేత్రం న్యూస్): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి.నవీన్ యదవ్ గెలుపు సంబరాలు శేరిలింగంపల్లి నియోజకవర్గం, కూకట్ పల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు మందుల శివకుమార్ అధ్వర్యంలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద ఘనంగా నిర్వహించారు. డివిజన్ పరిధిలోని ఆయా ప్రాంతాలలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి బాణా సంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలును చూసి ప్రజలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించారని అన్నారు.
నాడు కంటోన్మెంటు, నేడు జూబ్లీహిల్స్, రేపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాపిరెడ్డి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఊట్ల చంద్రారెడ్డి, ప్రగతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మాచర్ల విష్ణు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉదయ్ రావు,ఎస్పీ పరశురాం, శ్రీరాముడు వెంకటేష్, అరుణ్, కన్నారావు,సోఫాన్ రావు, మేరాజ్,శంకర్ రావు, శ్రీకాంత్ రెడ్డి, ముత్తయ్య, రాజు,వెంకట్ యాదవ్, ఎల్లారెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


