ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :మే5: నెల్లూరు జిల్లా : కావలి పట్టణం సమీపంలో ఉన్న ముసునూరు ప్రాంతంలో, దైవజనులు పాస్టర్.అలహరి , వంశీ, నూతనంగా కల్వరి పవర్ మిషన్ స్వచ్ఛంద సంస్థని ఏర్పాటు చేసుకోవడం జరిగింది, మాస్టర్ వంశీ తన తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు,అలహరి సామ్యూల్ లివింగ్స్టన్ ,జనరల్ సెక్రెటరీగా నియమించారు , పాస్టర్ వంశీ ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు , ఆయన, కుమారుడు,ఈ సేవ బాధ్యతలను స్వీకరించి నిర్వహిస్తున్నట్టు ఆయన తెలియపరిచారు, 1993 సంవత్సరమున, ప్రభువైన ఏసుక్రీస్తును సొంత రక్షకుడిగా ఆయన స్వీకరించడం జరిగింది.

డిగ్రీ పూర్తిచేసుకుని ఉద్యోగం అన్వేషిస్తున్న సమయంలో, యవ్వన జీవితంలో, తన ఇష్టానుసారంగా కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రభువైన ఏసుక్రీస్తు గురించి ఆయన వినడం జరిగింది, అ మార్గము ఆయనకి నచ్చిన వెంటనే ప్రభువైన యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా ఆయన స్వీకరించి సుమారు 32 సంవత్సరాలుగా సుదీర్ఘ ప్రయాణం చేస్తూ అనేకులను క్రీస్తు మార్గము గురించి బోధిస్తూ ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటూ నిరుపేదల మధ్య ఆయన క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ఇప్పుడు ఒక మందిరం ప్రారంభోత్సవం జరుపుకోవడం జరిగింది , ఈ ప్రారంభోత్సవానికి కావలి పట్టణంలో ఉన్న ప్రముఖ దైవజనులు ఆహ్వానించి , సంఘ సభ్యులతో కలసి ఈ ప్రారంభోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Calvary Power Mission NGO

You cannot copy content of this page