జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 12 at 18.51.58

TRINETHRAM NEWS

నవంబర్ 16వ తేదీ లోపు క్యాడర్ ఫిక్సషన్, బేసిక్ పే వేతనం అమలు చేయాలి జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులందరికీ ఎన్ హెచ్ ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్

వరంగల్ జిల్లా 12-11-2024 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

వైద్య ఆరోగ్యశాఖ పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ 78 క్యాడర్లలో సుమారు 17,541 మంది పనిచేస్తున్నారని, వారందరికీ క్యాడర్ ఫిక్సేషన్ చేయాలని, జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులందరికి బేసిక్ పే వేతనం అమలు చేయాలని జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్ చేశారు.చాలా సంవత్సరాల నుంచి చాలిచాలని వేతనాలు తీసుకుంటూ ప్రజల కాపాడటంలో ప్రాణాలను అత్యంత కీలక పాత్ర ఎన్.హెచ్.ఎం. ఉద్యోగులు పోషిస్తున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు గైడెన్స్ 2016లో ఇచ్చిన ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ,బేసిక్ పే అమలు చేయాలని, గత ప్రభుత్వం విడుదల చేసిన పి.ఆర్.సి బకాయిలు 7 నెలల వెంటనే చెల్లించాలని,ఎన్.హెచ్.ఎంఉద్యోగులందరికీ సంవత్సరానికి 35 రోజుల క్యాజువల్ లీవ్స్ మంజూరు చేయాలిని , హెల్త్ కార్డ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ,మహిళ ఉద్యోగస్తులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలను ఎన్ హెచ్ ఎం ఉద్యోగులతో భర్తీ చేయాలని, ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలనీ కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2024 నవంబర్ 16 వ తేదీ లోపు పై సమస్యలు పరిష్కరించాలని, క్యాడర్ ఫిక్సేషన్ లో ఎలాంటి అవ కతవకలు జరగకుండా ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగి యొక్క మూల వేతనం ఉండే విధంగా ఒక కొత్త జీవో రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. నవంబర్ 16వ తేదీ లోపు బేసిక్ వేతన సవరణ జరగకపోతే , తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరూ సమ్మెకు దిగుతామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page