జూన్ 26, 2026

WhatsApp Image 2023 12 23 at 2.30.21 PM

TRINETHRAM NEWS

Road Accident : అనంతపురం జిల్లాలో బస్సు-ట్రాక్టర్‌ ఢీ: నలుగురి మృతి

అనంతపురం: బస్సు, ట్రాక్టర్‌ ఢీకొని నలుగురు మృతిచెందిన సంఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నే మండలం కల్లూరు వద్ద చోటుచేసుకుంది. శనివారం వేకువ జామున బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ప్రైవేట్‌ బస్సు ఢీకొట్టింది..

ఈ ఘటనలో ట్రాక్టర్‌లో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. మృతులను గుత్తి మండలం మామిడూరుకు చెందిన చిన్నతిప్పయ్య(45), శ్రీరాములు(45), నాగార్జున(30), శ్రీనివాసులు(30)గా గుర్తించారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌ సహా మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. గాయపడ్డ నరేశ్‌ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో అతడిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు..

You cannot copy content of this page