ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
brutal killer

కన్నబిడ్డలు భార్యను కూడా కడతేర్చాడు..!

కేసు పెట్టిన బాలికను పొలంలోకి తీసుకువెళ్లి రేప్ చేసి కిరాతకంగా హత్య చేసిన ఉన్మాది..!

బాలిక తల్లి నానమ్మను కూడా..!

షాబాద్ లో ఘటన.! స్థానికంగా భయానక వాతావరణం..! తీవ్ర భయాందోళనలో చుట్టుపక్కల వాళ్ళు..!

Brutal Killer : త్రినేత్రం న్యూస్ : షాబాద్ మండలంలో ఆరుగురి హత్య కేసులో వెలుగులోకి కీలక అంశాలు… పోక్సో కేసులో రెండు నెలల్లో బెయిల్‌పై విడుదలై మారణకాండ సృష్టించిన నిందితుడు… మే 16వ తేదీన పోక్సో కేసులో బాధిత బాలిక తల్లి ఫిర్యాదు చేయగా, మే 26వ తేదీన రిమాండుకు తరలించిన పోలీసులు… అయితే పోలీసులు కేవలం 7 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లు జత చేసి కేసు నమోదు చేయడం చర్చనీయాంశం… మరోవైపు కేవలం రూ.20,000 పూచీకత్తుతో రెండు నెలల్లోనే బెయిల్ రావడంతో, బయటికి వచ్చి ఆరుగురిని కిరాతకంగా హతమార్చిన రాజ్ కుమార్..

పోక్సో కేసులో బెయిల్ మీద వచ్చి ఆరుగురిని హత్య చేసిన నిందితుడు..! రంగారెడ్డి జిల్లాలో దారుణం..! షాబాద్ మండలం దైవాలగూడలో తన కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన రాజ్ కుమార్(28) అనే వ్యక్తిపై మే 16వ తేదీన ఫిర్యాదు చేసిన బాధితురాలి తల్లి… మే 26వ తేదీన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించగా, ఇటీవల బెయిల్‌పై తిరిగి వచ్చిన రాజ్ కుమార్… బెయిల్‌పై తిరిగి వచ్చిన అనంతరం తనపై పోక్సో కేసు పెట్టారని కక్షతో ఉన్నదిగా మారిన నిందితుడు..!

కేసు పెట్టిన బాలికతో పాటు, బాలిక తల్లి, బాలిక నానమ్మలతో పాటు, తన భార్య సరిత, తన ఇద్దరు పిల్లలను కూడా దారుణంగా హతమార్చిన రాజ్ కుమార్..! కేసు పెట్టిన బాలికను పొలంలోకి తీసుకెళ్లి రేప్ చేసి చంపినట్టు సమాచారం..! ఈ విషయం తెలిసి పోలీసులకు సమాచారం ఇచ్చిన రాజ్ కుమార్ తల్లిదండ్రులు..! ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..!

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page