
గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుండి అసెంబ్లీ వరకు బీఆర్ఎస్ నిరసన ర్యాలీ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
నిరసన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు
BRS Protest : త్రినేత్రం న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు ఇచ్చి,గ్యారంటీ కార్డులు పంచి,గెలిచాక అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ వంచిస్తోందని,హామీలను ఎగ్గొట్టి,అబద్ధాలను ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో నిలదీస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుండి అసెంబ్లీ వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు,మరియు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గన్ పార్క్ నుండి అసెంబ్లీ వరకు ఆరు గ్యారంటీలను అమలు చేయాలని నిరసన ర్యాలీ నిర్వహించారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

