Brahmotsavam Wall Poster : బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరణ

TRINETHRAM NEWS
వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి.

ఎం ఎల్ ఏ బాలు నాయక్.

దేవరకొండ డివిజన్ జనవరి 30 త్రినేత్రం న్యూస్. గుడిపల్లి మండలంలోని కోదండాపురం గ్రామంలో తేదీ 06- 02- 2026 రోజు నుండి 12- 02- 2026 వరకు నిర్వహించే శ్రీ పద్మావతి – గోదాదేవిల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ను దేవరకొండపట్టణంలోని ఎమ్మెల్యే నివాసం (వ్యవసాయ మార్కెట్ యార్డ్) లో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులతో కలిసి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఆవిష్కరించారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలనువిజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులను కోరారు.
ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొంది,శ్రీ వెంకటేశ్వరస్వామి అనుగ్రహం పొందాలనిఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కో ఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల వెంకటయ్య గౌడ్, శిరందాస్ కృష్ణయ్య, మాజీ ఎంపీపీ తెర సత్యం, మాజీ జడ్పీటీసీ మరుపాకల అరుణ సురేష్ గౌడ్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ గజ్జలవెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Brahmotsavam wall poster launch

You cannot copy content of this page

Scroll to Top