ఈరోజు త్రిపురాంతకం మండలం మేడపి యూనిట్లో బ్రహ్మాస్త్రం తయారు చేయడం జరిగింది బ్రహ్మాస్త్రం తయారు చేయటానికి కావలసిన పదార్థాలు బాగా దంచిన వేపాకుల ముద్ద మూడు కిలోలు కానుగాకుల ముద్ద రెండు కిలోలు సీతాఫలమాకుల ముద్ద రెండు కిలోలు ఉమ్మెత్త ఆకుల ముద్ద రెండు కిలోలు ఆముదాకుల ముద్ద రెండు కిలోలు ఇవన్నీ తీసుకొని ఒక పాత్రలో 10 లీటర్ల నీరు తీసుకుని అందులో ఇవన్నీ వేసి బాగా మరిగించి ఐదు పొంగులు వచ్చేంతవరకు ఉడికించా లి తరువాత దానిని 24 గంటలు చల్లార్చుకుని వడపోసుకుంటే ఆరు లీటర్ల బ్రహ్మాస్త్రం తయారవుతుంది ఈ బ్రహ్మాస్త్రాన్ని 200 లీటర్ల నీటిలో కలుపుకొని అందులో 10 లీటర్ల ఆవు మాత్రం కలుపుకొని ఒక ఎకరాకు పిచికారి చేసుకోవచ్చు. దీనివల్ల గొంగళి పురుగు రసం పీల్చే పురుగు కాండం తొలిచే పురుగు కాయ తొలిచే పురుగు పూర్తిగా నశిస్తాయి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది నాసర్ రెడ్డి కే బాలయ్య జి ఏడుకొండలు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App