WhatsApp Image 2024 02 19 at 07.54.04
Trinethram News : తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. నేడు తిరుమల శ్రీవారి మే నెల టికెట్లు విడుదల కానున్నాయి. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా ఉ.10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల కానున్నాయి.
ఈ మేరకు టీటీడీ అధికారిక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవలకు లక్కిడిఫ్ విధానంలో పోందడానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని పేర్కొంది టీటీడీ.
ఇక 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 23వ తేది మధ్యాహ్నం 12 గంటల వరకు లక్కిడిఫ్ విధానంలో టికెట్లు పోందిన భక్తులు వాటిని ఆన్ లైన్ విధానంలో పేపేంట్ చేసి టికెట్లు పొందేందుకు గడువు ఉంటుంది. అటు ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఉంజల్ సేవా, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లు విడుదల కానున్నాయి.
ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణం, 11 గంటలకు శ్రీవాణి, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదులు కోటా విడుదల చెయ్యనుంది టీటీడీ. ఇక ఈ టికెట్ల కోసం Tirumala Tirupati Devasthanams (Official Website..https://www.tirumala.org/)ను సంప్రదించాల్సి ఉంటుంది.
