
Trinethram News : అదిలాబాద్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా
రెబ్బెన మండలంలోని మాదవాయిగూడ పెద్దవాగులో ఆదివారం విగ్నేశ్వర్ గల్లంతైన విషయం తెలిసిందే సోమవారం ఉదయం నుండి ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్ళతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు ఉదయం నుండి గాలించగా మధ్యాహ్నం మృతదేహాన్ని వెలికి తీశారు. కళ్ళ ముందు విగతజీవిగా పడి ఉన్న కుమారున్ని చూసి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు బంధువులు గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు
