
Transport Facilities : డుంబ్రిగుడ, అక్టోబర్ 6 (త్రినేత్రం న్యూస్) : ప్రధానమంత్రి జన్‌జాతి ఆదివాసీ న్యాయ్ మహా అభియాన్ (పీఎం-జన్‌మన్) పథకంలో భాగంగా ‘అడవి తల్లి బాట’ కార్యక్రమం ద్వారా నిర్మించిన 30 తారు రోడ్లను సోమవారం చాపరాయి వద్ద జిల్లా కలెక్టర్ టి. నిషాంతి ప్రారంభించారు. రూ.70.68 కోట్ల అంచనా వ్యయంతో 75.64 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ రహదారులు అరకు నియోజకవర్గంలోని మారుమూల గిరిజన ప్రాంతాలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచనున్నాయి.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రహదారుల నిర్మాణంతో విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, నిత్యావసర సేవలు గిరిజన గ్రామాలకు మరింత చేరువవుతాయని తెలిపారు. పీఎం-జన్‌మన్ తొలి దశలో మంజూరైన 80 రోడ్లలో 30 పూర్తయ్యాయని, మరో 16 రోడ్లు పూర్తి కావస్తున్నాయని, మిగిలిన పనులు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు.
అదేవిధంగా నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా ప్రారంభించి, ప్రజలకు వైద్య పరీక్షలు, మందులు, తల్లి-బిడ్డ ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ, సబ్‌కలెక్టర్ , ఏపీఎస్‌ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ దోన్నుదొర అధికారులు, ప్రజాప్రతినిధులు, కోసంగి, పెదపాడు, చంపపుట్టి గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe