
Bizarre Incident : త్రినేత్రం న్యూస్ : గుజరాత్‌లోని మోర్బీ జిల్లా వీర్‌పర్దా గ్రామంలోని ఓ రైతు బావిలో నీరు అలల్లా కదలడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. మూడు నెలల క్రితం తవ్విన ఈ బావి.. ఈ ఏడాది మంచి వర్షాల తర్వాత పూర్తిగా నీటితో నిండింది. గత ఆదివారం నుంచి బావి నీరు ఒక్కసారిగా మసకబారుతూ, అలల మాదిరిగా ఊగడం ప్రారంభమైంది.
గత 8–10 రోజుల్లో మోర్బీ జిల్లాలో ఎలాంటి భూకంపం లేదా భూగర్భ ప్రకంపనలు నమోదుకాలేదని.. భూగర్భ శిలల మధ్య చిక్కుకున్న వాయువుపై వర్షపు నీటి ఒత్తిడి పెరగడం వల్లే ఈ కదలికలు ఏర్పడి ఉండొచ్చని జిల్లా జియాలజిస్టులు ప్రాథమికంగా అంచనా వేశారు.
అసలు కారణాన్ని గుర్తించేందుకు భూగర్భ జల పరిశోధనా సంస్థ (GWRI) నిపుణులతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక సాంకేతిక విచారణకు ఆదేశించింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe