దేవరకొండ డివిజన్ డిసెంబర్ 02 త్రినేత్రం న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ కోరారు. మంగళవారం చింతపల్లి కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు అండేకార్ అశోక్, మాజీ సర్పంచ్ నాదరి రమేష్,అండేకార్ వెంకటేష్ తోపాటు పలువురు బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….గత పదేళ్ళలో కేసీఆర్ చేసిన అభివృధి సంక్షేమ పథకాలే మన అభ్యర్థులను గెలిపిస్తాయి అని ఆయన అన్నారు.రెండేళ్ల నుండి కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని ఆయన తెలిపారు.కాంగ్రెస్ చేసిన మోసాలు, బిఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమాన్ని గుర్తు చేస్తూ ప్రజల వద్దకు వెళ్లాలి అని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యా నాయక్,కంకణాల వెంకట్ రెడ్డి,బిఆర్ఎస్ మండల అద్యక్షులు దొంతం చంద్రశేఖర్ రెడ్డి, కుంభం శ్రీశేలం గౌడ్,తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


