Ravindra Kumar : కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్

TRINETHRAM NEWS

బీ ఆర్ ఎస్ లో చేరికలు.

స్థానిక ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి.

మాజి శాసనసభ్యులు-రవీంద్రకుమార్.

దేవరకొండ డివిజన్ డిసెంబర్ 05 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో దేవరకొండ మండలం జిల్లపల్లి గ్రామం నుంచి 80 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటుతో సురుకు పెట్టాలి అని ఆయన కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లయింది,ఎన్నికల ముందు గ్యారెంటీ కార్డులు పంచి బాండ్ పేపర్ రాసిచ్చారు కాని ఇప్పటికీ రెండు సంవత్సరాలయింది ఒక్క హామీ కూడా అమలు చేయలేదు అని ఆయన తెలిపారు.200 పెన్షన్ 2000 చేసింది కేసీఆర్ అని ఆయన గుర్తు చేశారు.ఇంటింటికి మంచినీళ్లు అందించింది కేసీఆర్, పదివేల రైతుబంధు ఇచ్చింది కేసీఆర్ గారిది అని ఆయన తెలిపారు.

కేసీఆర్ కిట్టు పెట్టి 13వేల రూపాయలు కాన్పుకి ఇచ్చింది కేసీఆర్ అని ఆయన గుర్తు చేశారు.పిల్లల చదువుల కోసం వెయ్యి గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసింది కేసీఆర్ అని ఆయన అన్నారు.కేసీఆర్ చెప్పినవి చేసిండు చెప్పనివి కూడా చేసిండు అని,రేవంత్ రెడ్డి 2000 పెన్షన్ను 4000 ఇస్తానన్నాడు. ఏమైంది కేసీఆర్ ఇచ్చిన 2000 తప్ప ఒక్క రూపాయి అయినా ఎక్కువ వచ్చిందా అని ఆయన అడిగారు.బతుకమ్మకు రెండు చీరలు ఇస్తానన్న రేవంత్ రెడ్డి బతుకమ్మకు చీరలకు ఎగ్గొట్టిండు. ఓటు కోసం ఒక చీర పంపిండు అది కూడా కొందరికి,పోరగాండ్ల స్కూలు యూనిఫామ్ లాగా ఉంది రేవంత్ రెడ్డి పంపిన చీర అని ఆయన తెలిపారు.ఒక చీరకు సారె పెట్టిన అంటున్నారు..

60 వేల రూపాయలు ప్రతి అక్కకు చెల్లెకు బాకీపడ్డాడు రేవంత్ రెడ్డి అని అన్నారు.మహాలక్ష్మి కింద 60,000 ఇచ్చి సారె పెట్టిన అని చెప్పు రేవంత్,కల్యాణ లక్ష్మి లేదు. తులం బంగారం అంతకంటే లేదు. అరచేతిలో వైకుంఠం చూపించి ఆగమాగం చేసిండు అని ఆయన తెలిపారు.ఆడోళ్ళకి ఫ్రీ బస్సు మొగోళ్ళకి డబుల్ టికెట్.. ఇది మోసం కాకపోతే ఏమిటి ఆయన ప్రశ్నించారు.కాంగ్రెస్ పాలనలో కనీసం ఊర్లలో ట్రాక్టర్లలో డీజిల్ కి డబ్బులు లేవు. వీధిదీపాలకు బల్బులు లేవు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే అని అందరూ యాది చేసుకుంటున్నారు అని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సంకూ కొండల్ రెడ్డి, శైలేందర్ రెడ్డి, వెంకటయ్య తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Big shock for Congress party

You cannot copy content of this page

Scroll to Top