TRINETHRAM NEWS

వికారాబాద్ పట్టణంలో 80 కోట్ల రూపాయల నిధులతో భూమి పూజ

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ మున్సిపల్ పరిధిలో శంకుస్థాపన కార్యక్రమాల వివరాలు.TUFIDC పథకం ద్వారా మంజూరైన 66 కోట్ల 22 లక్షల పనులు వివరాలు.4 కోట్ల రూపాయలతో శివారెడ్డి పేట లోని శివసాగర్అభివృద్ధి మరియు ఎన్నంపల్లి జంక్షన్, యన్ టి ఆర్ జంక్షన్, బిజేఆర్ జంక్షన్ మరియి రైల్వే స్టేషన్ ప్రాంతంలోని అంబేడర్క్ జంక్షన్ల అభివృద్ధి.

6 కోట్ల 50 లక్షలతో గంగారాం ఈద్గా నుండి బూర్గంపల్లి హనుమాన్ టెంపుల్ వరకు, వెంకటాపూర్ కాలనీ లో మహావీర్ కమాన్ నుండి మహావీర్ హాస్పిటల్ వరకు బిటీ రోడ్డు నిర్మాణం మరియు అస్సామ్ బేకరి నుండి మైదం శ్రీనివాస్ ఇంటి వరకు మరియు అయ్యప్ప కమాన్ నుండి డైట్ కాలేజి వరకు సిసి రోడ్ల నిర్మాణం.2 కోట్ల 50 లక్షలతో గాందీ పార్కు సమీపంలోని IDSMT భవనం బ్యాలన్స్ పనులు పూర్తి చేయడం మరియు ధన్నారం స్మశానవాటిక అభివృద్ధి. 8 కోట్లతో వార్డు నెంబర్ 1, 12, 13, 14, 22, 23 లలోని కొత్తగడి, కొంపల్లి, ఆలంపల్లి, మరియు వెంకటేశ్వర కాలనీలలో సిసి రోడ్ల నిర్మాణం. 6 కోట్లతో వార్డు నెంబర్ 2, 3, 4, 5, 15 లలోని ధన్నారం, ఎన్నెపల్లి, శివారెడ్డిపేట, కోత్రేపల్లి మరియు కమలా నగర్ లలో సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం.

8 కోట్లతో వార్డు నెంబర్ 6,7,8,9 లలోని వెంకటాపూర్ తాండా, గుడుపల్లి, మద్గుల్ చిట్టంపల్లి,బుర్గుపల్లి మరియు సాయిబాబా కాలనీలలో మేజర్ సిసిరోడ్లు,డ్రైనేజీల నిర్మాణం.9 కోట్లతో వార్డు నెంబర్ 10,11, 18,19,20,21 లలోని అనంతగారిపల్లి, గిర్గేట్ పల్లి, రామయ్యగూడ, రిక్షా కాలనీ, రాజీవ్ గ్రుహకల్ప మరియు రామయ్య గూడ MIG కాలనీ లలో మేజర్ సిసి రోడ్లు, డ్రైన్లు నిర్మాణం. 5 కోట్లతో వార్డు నెంబర్16,17,27,28 లలోని గంగారాం, మధు కాలనీ, రాజీవ్ నగర్ కాలనీ, గాందీ కాలనీ మరియు పాత గంజ్ లలో మేజర్ సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం.4 కోట్ల 75 లక్షలతో వార్డు నెంబర్ 24,25,26, 29 లలోని శివాజీ నగర్, అఫ్సర్ గంజ్ బాగ్, సుభాష్ నగర్, కొత్త గంజ్, మల్లిఖార్జున నగర్, ఇస్కాన్ బాగ్, కన్యాలాల్ బాగ్ లలో మేజర్ సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం 6 కోట్ల 25 లక్షలతో వార్డు నెంబర్ 30,31,32,33,34 లలోని ఇంద్రా నగర్, గరీబ్ నగర్, వినాయక హిల్స్, శివరాం నగర్, BTS కాలనీ, సింగారపు రాచయ్య కాలనీ, వెంకటేశ్వర కాలనీ, MIG కాలనీ లలో మేజర్ సిసీ రోడ్లు, డ్రైనేజీ ల నిర్మాణం.ఇందులో రూ. 6. 22 కోట్లతో స్థానికంగా కాలనీలలో చేపడుతున్న పనుల వివరాలు.50 లక్షల రూపాయలతో దన్నారం స్మశాన వాటికలో వసతుల కల్పన .40 లక్షల రూపాయలతో కన్యాలాల్ బాగ్ లో పిపి వెంకటయ్య ఇంటి నుండి రామయ్య గూడ మేయిన్ రోడ్ వరకు సిసి రోడ్డు, మరియు BJR, NTR జంక్షన్ల అభివృద్ధి. 25 లక్షల 71 వేలతో ఆలంపల్లి మేయిన్ రోడ్డు నుండి బాలాజీ స్వీట్ హౌజ్, దర్శన్ గౌడ్ ఇల్లు, భవాని కాలని బసంత్ ఫంక్షన్ హాల్ ప్రాంతంలో నూతనంగా సిసి రోడ్డు నిర్మాణం.46 లక్షలతో కమలా నగర్ లో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా మరియు రాజీవ్ నగర్ లో ఆదర్శ్ హౌజ్ నుండి ఖాజా హౌజ్ వరకు సిసి రోడ్డు నిర్మాణం.

42 లక్షలతో పదవ వార్డులోని అనంతగిరిపల్లి లో మదరసా మదు కాలనీ, కొత్తగడి, కొంపల్లి లలో సిసి రోడ్లు మరియు సైడ్ డ్రైన్ పైప్ వర్క్స్ నిర్మాణం.75 లక్షలతో పాత కూరగాయల మార్కెట్ లో పాత షెడ్లు రిపేర్లు, కొత్త షెడ్లు మరియు ఫ్లోరింగ్ నిర్మాణం. 70 లక్షలతో మహావీర్ హాస్పిటల్ రోడ్డులో సిసి రోడ్డు నిర్మాణం. 52 లక్షలతో అస్సామ్ బేకరీ నుండి డైట్ రోడ్డు వరకు నూతనంగా సిసి రోడ్డు నిర్మాణకోటి రూపాయలతో 25వ వార్డులోని కొత్త గంజ్, బిటియస్ కాలనీ, సుభాష్ నగర్ నాలా ప్రాంతంలో సిసి రోడ్లు మరియు డ్రైనేజీల నిర్మాణం.53 లక్షల 50 వేలతో MIG కాలనీ, చంద్రబాన్ కాలనీ, శివాజీ నగర్ కాలనీ లలో సిసి రోడ్లు నిర్మాణం.68 లక్షలతో హైదరాబాద్ రోడ్డు నుండి వీరబ్రహ్మంగారి గుడి వరకు మరియు బస్టాండ్ మెయిన్ రోడ్డు నుండి బీరమయ్య ఇంటి వరకు సిసి రోడ్డు నిర్మాణం.

ఈ విదంగా ఒక్క TUFIDC ద్వారానే వికారాబాద్ మున్సిపాలిటి పరిధిలో అభివృద్ధి పనులకు 66 కోట్ల 22 లక్షల 21 వేల రూపాయల నిధులు మంజూరు అయ్యాయి. వీటితో పాటుగా అమృత్- 2 పథకం కింద మంజూరైన 12 కోట్ల రూపాయల నిధులతో వికారాబాద్ పట్టణంలో మంచి నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడం, పాత లైన్ల రిపేర్ తో పాటుగా పట్టణ జనాభాకు నీళ్లకు ఇబ్బందులు లేకుండా నూతన పైప్ లైన్ల నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుంది. పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి 1 కోటి 43 లక్షలతోనూతనంగా పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం జరుగుతుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App