TRINETHRAM NEWS

Bhola Baba appeared before the media

Trinethram News : ఉత్తరప్రదేశ్ : జులై 06
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాత్రాస్ జిల్లా ఫుల్‌ర‌యీ గ్రామంలో జూలై 2న పెనువిషాదం చోటుచేసు కున్న విషయం తెలిసిందే.

స‌త్సంగ్ కార్య‌క్ర‌మంలో భోలే బాబా పాద దూళి కోసం భక్తులు ఒక్కసారిగా ఎగడ బడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 121 మంది మృతిచెందగా.. అనేక‌ మందికి గాయాలయ్యాయి.

మృతుల్లో అధికంగా మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాం తికి గురిచేసింది. అయితే, ఈ ఘటన తరువాత భోలేబాబా పరారీలో ఉన్నాడు.

తాజాగా ఈరోజు ఉదయం ఆయన తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. హత్రాస్ ఘటన గురించి మౌనం వీడాడు. ఈ దుర్ఘటనపై విచారణ వ్యక్తం చేశారు..హత్రాస్ ఘటన మిగిల్చిన విషాదాన్ని భరించే శక్తి దేవుడు మాకు ప్రసాదించాలని, కోరుకుం టున్నానని,అన్నారు..

ఈ ఘటన తరువాత నేను ఎంతో వేదనకు గురయ్యా ను. తొక్కిసలాటకు కారణ మైన వారు ఎట్టిపరిస్థితుల్లో తప్పించుకోలేరని నేను నమ్ముతున్నాను.

నాకు ప్రభుత్వ యంత్రాంగం పై నమ్మకం ఉంది. బాధ్యు లైన వారు తప్పనిసరిగా తగిన శిక్ష అనుభవిస్తారని భోలే బాబా అన్నారు.

మరణించిన కుటుంబాలు, గాయపడిన వారికి జీవితాం తం అండగా నిలబడాలని, వారికి సాయం చేయాలని నా న్యాయవాది ఏపీ సింగ్ ద్వారా కమిటీ సభ్యులను అభ్యర్థించానని మీడియా ముందు ఆయన అన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bhola Baba appeared before the media