జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 06 at 12.07.24

TRINETHRAM NEWS

Baba Vanga’s new prophecies

Trinethram News : 5079లో ప్రపంచం అంతం.. 3797లో భూమి నాశనం.. బాబా వంగా సరికొత్త జోస్యాలు

అప్పటి దాకా బ్రతికి ఉండడం కష్టం అంటున్నారు…ఇప్పటి మానవులు

2130లో గ్రహాంతర జీవులతో భూమికి సంబంధం
ఏర్పడుతుందని బాబా వంగా కాలజ్ఞానం

3005లో కుజ గ్రహంపై యుద్ధం జరుగుతుందని జోస్యం

రాబోయే దశాబ్దాలు, శతాబ్దాల్లో జరగబోయే ఘటనలు చెప్పిన అంధ ఆధ్యాత్మికవేత్త

కాలజ్ఞానిగా ప్రపంచవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న బల్గేరియాకు చెందిన అంధ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా రానున్న దశాబ్దాలు, శతాబ్దాల కాలంలో ఏం జరగబోతున్నాయో చెప్పిన మరికొన్ని జోస్యాలు వెలుగులోకి వచ్చాయి.

రాబోయే దశాబ్దాల్లో బాబా వంగా జోస్యాలు..

2025 – యూరప్‌లో ఒక పెద్ద వివాదం చెలరేగుతుంది. దీని కారణంగా ఈ ఖండంలో జనాభా గణనీయంగా తగ్గుతుంది.

2028 – కొత్త ఇంధన వనరుల అన్వేషణలో మనుషులు శుక్ర గ్రహానికి వెళ్తారు.

2033 – భూమి ధ్రువాల్లో మంచు కరగడంతో సముద్ర మట్టాలు గణనీయంగా పెరిగిపోతాయి.

2076 – ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం తిరిగి వస్తుంది.

2130 – గ్రహాంతర జీవులతో భూమికి సంబంధం ఏర్పడుతుంది.

2170 – ప్రపంచవ్యాప్తంగా కరువు వస్తుంది.

3005 – కుజ గ్రహంపై యుద్ధం జరుగుతుంది

3797 – భూమి నాశనం అవుతుంది. అయితే సౌర వ్యవస్థలోని మరొక గ్రహానికి వెళ్లగలిగే సామర్థ్యం మానువులకు ఉంటుంది.

5079 – ఈ ప్రపంచం అంతమైపోతుంది.

కాగా బాబా వంగా అసలు పేరు వాంజెలియా పాండేవా గుష్టెరోవా. 12 సంవత్సరాల వయసులోనే చూపుని కోల్పోయారు. 85 ఏళ్ల వయస్సులో 1996లో ఆమె మరణించాడు. చూపులేకపోయినప్పటికీ ఆమె చెప్పిన జోస్యాల్లో చాలా నిజమయ్యాయి. ముఖ్యంగా అమెరికాను గజగజలాడించిన 9/11 ఉగ్రవాద దాడులు అక్షరాలా నిజమయ్యాయని చెబుతుంటారు.

‘‘రెండు లోహపు పక్షులు అమెరికన్ సోదరులపైకి దూసుకెళ్తాయి. పొదల చాటు నుంచి తోడేళ్లు అరుస్తాయి. అమాయకుల రక్తం నదులలో పారుతుంది’’ అని ఆమె ఊహించి చెప్పారు. అమెరికాలో జరిగిన ట్విన్ టవర్ల దాడి దీనికి దగ్గరగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక బ్రిటన్ యువరాణి డయానా మరణం, బ్రెగ్జిట్‌తో పాటు మరికొన్ని ఘటనలు ఆమె జోస్యాల ప్రకారమే జరిగాయని విశ్వసిస్తుంటారు. అందుకే ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Baba Vanga's new prophecies

You cannot copy content of this page