Bonala Jatara : బోనాల జాతరలో పాల్గొన్న భీమ్ భారత్

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :చేవెళ్ల నియోజకవర్గం: కొండకల్ గ్రామంలో బోనాల జాతర లో పాల్గొన్న భీమ్ భరత్ గచేవెళ్ళ నియోజక వర్గం లోని శంకర్ పల్లీ మండలం కొండకల్ గ్రామంలో పోచమ్మ తల్లి బోనాల జాతర పండుగ లో పోచమ్మ తల్లి నీ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన చేవెళ్ల నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. గ్రామ వాసులు పోచమ్మ ఆలయం వద్ద బోనాలు సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు.
కొండకల్ గ్రామ వాసులు గ్రామ పెద్దలు డప్పు చప్పుళ్ళతో, పోతురాజుల ఆటలతో మరియు వివిధ రకాల విన్యాసాలతో భీమ్ భరత్ కు స్వాగతం పలికారు.అనంతరం పోతురాజులతో, గ్రామస్థులతో కలిసి డప్పు చప్పుళ్లకు చిందులేసిన భీమ్ భరత్ .ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా పాల్గొన్న ఆయా గ్రామ పెద్దలు కాశి నాథ్ గౌడ్ , శంకర్ పల్లీ మండలం అధ్యక్షులు జనార్దన్ రెడ్డి , వెంకట్ రాజు , సీనియర్ నాయకులు బద్దం కృష్ణ రెడ్డి, గ్రామ పెద్దలు , యువకులు , ప్రజలు ,భారీ సంఖ్యలో మహిళలు కాంగ్రెస్ పార్టీ నాయకులు , తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bheem Bharat participated in

You cannot copy content of this page

Scroll to Top