Bharosa Seva Samiti for distribution of books to students
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
విద్యార్థులకు ప్రోత్సాహం అందించడం దేశ భవిష్యత్తుకు పునాది వేయడంలాంటిదని భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్య క్షురాలు హసీనా బేగం విద్య భారతి, విద్యానికేతన్ ప్రిన్సిపాల్ అరికాల రామచందర్, బేగం శ్రీనివాస్ అన్నారు.
గోదావరిఖనికి చెందిన నసీమా బేగం ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ పేద విద్యార్థుల చదువుకు సహాయం చేస్తూ వారికి భరోసాగా నిలుస్తూన్నారు. ఈ సేవ కార్యక్రమాలను విస్తృతం చేయాలనే సంకల్పంతో నసీమా బేగం భరోసా అనే సంస్థను కూడా ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో అడ్డగుంట పల్లెలోని విద్య భారతి స్కూల్ కు చెందిన ఐదుగురు నిస్సహాయ చిన్నారులకు సంవత్సరానికి సరిపడా నోట్ బుక్ లను, పెన్నులను విద్యానికేతన్ ప్రిన్సిపాల్ అరకల రామ చందర్ జక్కం శ్రీనివాస్ చేతుల మీదుగా అందించారు.
ఈ సందర్భంగా అరుకాల. రామ చందర్ జక్కం శ్రీనివాస్ మాట్లాడుతూ మంచి విజన్ తో పేద విద్యార్థులకు సహాయం చేద్దామనే సదుద్దేశంతో నసీమా మిత్రబృందం కలిసి ఏర్పాటుచేసిన భరోసా సంస్థ పేద విద్యార్థులకు అండగా నిలుస్తుండడం గొప్ప విషయం అని తెలిపారు. బృహత్తర సంకల్పంతో ముందుకు సాగుతున్న భరోసా సంస్థకు దాతలు సహకరించాలని వక్తలతో పాటు నసీమా బేగం కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App