నిరుద్యోగాన్ని రూపుమాపే దిశగా మంత్రి సుభాష్ ప్రణాళిక..
కొనాసిమజిల్లా : రామచంద్రపురం:త్రినేత్రం న్యూస్ : నిరుద్యోగ నిర్మూలన కోసం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో ఈనెల 26, 27 తేదీల్లో రామచంద్రపురంలోని కెవిఆర్ హాస్పిటల్ వద్ద ఉన్న ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్టు మంత్రివర్యులు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రామచంద్రపురం నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య లేకుండా చేసేందుకు వారం వారం జాబ్ మేళా కార్యక్రమంలో భాగంగా ఈనెల 26న అమర్ రాజా కంపెనీ చిత్తూర్ లో పనిచేసే విధంగా టెన్త్, ఇంటర్, ఐటిఐ లలో పాస్ / ఫెయిల్ అయిన 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయసు ఉన్న అభ్యర్థులు జాబ్ మేళాకు హాజరు కావాలని అని తెలిపారు.
అభ్యర్థుల అర్హతను బట్టి 12- 24 నెలల శిక్షణ కాలంలో రూ.12,500 వేలు నుంచి 15 వేలు స్టైపండ్ తో శిక్షణ, శిక్షణానంతరం రూ.22 వేలు (సీటీసీ జీతం) ఉచిత భోజన వసతి కల్పిస్తారని తెలిపారు. అలాగే ఈనెల 27న హీరో మోటార్స్ కంపెనీ శ్రీ సిటీ, తడ గ్రామం, తిరుపతి జిల్లాలో ఆపరేటర్ గా పనిచేయుటకు టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ చదువుకుని, 18 నుంచి 27 ఏళ్ల లోపు వయసు ఉన్న అభ్యర్థులు అర్హులన్నారు. ఎన్నికైన అభ్యర్థులకు రూ.20 నుంచి 22 వేలు జీతం ఉంటుందని, వీరికి కూడా రవాణా, భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తారన్నారు. మరిన్ని వివరాలు కోసం సెల్ నెంబర్: 95154 81671 లో సంప్రదించాలని కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


