అవాస్తవాలను ప్రచారం చేయవద్దు
మీరు గానీ మీ అనుచరులు గానీ వస్తే పీఠం లెక్కలు మొత్తం చూపిస్తాను.
కాంగ్రెస్ నుండి వైయస్సార్ సిపిలోకి మీరు పార్టీ మారలేదా?
మాజీ ఎమ్మెల్యే పై మాజీ జడ్పీటీసి కర్రి శేషారత్నం ఆగ్రహం.
Trinethram News : త్రినేత్రం న్యూస్ : అనపర్తిలో మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీపీ కర్రి శేషారత్నం గారు మీడియాతో మాట్లాడుతూ…… మాజీ MLA డా” సత్తి సూర్యనారాయణరెడ్డి గారి అవాస్తవాలను వాస్తవాలుగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. నేను పది రోజులైంది ఆయనకు కౌంటర్ ఇచ్చి. దానికి సమాధానం చెప్పకుండా వేరే వేరే ఏదో మాట్లాడటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు.
2006 లో మాకు మీరు 40 లక్షలు ఇస్తామని కబురు చేయడం వాస్తవం కాదా? గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి. కీ శే వీర్రెడ్డి గారు, లచ్చారెడ్డి గారు వచ్చి సాక్ష్యాలు చెప్పరు. మీకూడా తిరిగే అందరికీ కూడా జరిగిన విషయం తెలుసు.
నేను మీ గురించి వ్యక్తిగతంగా మాట్లాడానని అంటున్నారు. నేను ఏ విషయం మాట్లాడాను. వ్యక్తిగత విషయాలేమీ నేను మాట్లాడలేదు కానీ మీరు మాట్లాడారు. పది రోజులు ఆలోచించుకుని చివరకు మా పీఠంపై మీ కన్ను పడింది.
అనపర్తిలో రెండే సత్సంగాలు నడుస్తున్నాయి. వీరుళ్ళమ్మ సత్సంగం, బాపనమ్మ సత్సంగం. వాటికి నాకు సంబంధం లేదు. మీ అనుచరులే వాటిని నడుపుతున్నారు. వాళ్ళని అడగండి ఎంత డబ్బు ఉందో.
ఇక మా ఇంటి దగ్గర పీఠం నిల్ తో మొదలైంది. ఇపుడు కొంత డబ్బు, బంగారం ఉంది. మా పీఠానికి ఎంతమంది కమిటీయో కూడా మీకు తెలియదు. మేం అయిదుగురు కమిటీ ఉన్నాం. నా దగ్గర ప్రతీ పైసాకి అకౌంటు ఉంది. మీరు గానీ మీకు చెప్పిన మీ అనుచరులు గానీ వస్తే అకౌంట్సు చూపిస్తాను. మీరు బంగారం గురించి కోటి రూపాయల గురించి మాట్లాడారు. మీరు వస్తే లెక్కలు చూపిస్తాను. కోటికి ఎంత తక్కువ వస్తే అంతా మీరు కట్టేసి వెళిపోతే మా పీఠానికి ఆదాయం కలుస్తుందని విన్నవించుకుంటున్నాను.
మీరు నన్ను ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చారు మీ గురించి మాట్లాడితే మీ కుటుంబం పరువు పోతుంది అన్నారు. యెస్.. నేను ఉన్నతమైన కుటుంబం నుంచే వచ్చాను. నేను నా కుటుంబం పరువు పోయే రాజకీయం ఎప్పుడూ చేయలేదు. నిరూపించండి మీకింకా ఎన్నో విషయాలు తెలుసంటున్నారు కదా. ఇపుడు ఇదెలా చెప్పారో అవి కూడా చెప్పండి. మీకు పర్సనల్ విషయాలను రాజకీయం చేస్తున్నారు. దయచేసి ఎవరూ కుటుంబాల జోలికి వెళ్ళవద్గు. నా కుటుంబానికి అపకీర్తి తెచ్చే పని నేనెపుడూ చేయను. దయచేసి అవాస్తవాలను మాట్లాడవద్దు సూర్యనారాయణరెడ్డి,
నన్ను మీరే పార్టీలో ఉన్నారో తెలియడం లేదు అన్నారు. మీరు అనపర్తిలోనే ఉన్నారాండి. నేను గత ఎన్నికలలో తిరిగాను.
మహిళాశక్తిలో ఉన్నావు సూపర్ సిక్స్ గురించి చెప్పావు అవి జరుగుతున్నాయో లేదో చూసుకో అంటున్న మీకు అవి జరుగుతున్నాయో లేదో తెలియదా? మా నాయకుడు చెప్పిన ప్రతీది కూడా జరుగుతున్నాయి అంతే కాకుండా ఎక్స్ ట్రాగా ఎన్నో పధకాలు మహిళలకు సంబంధించినవి జరుగుతున్నాయి. మీ ప్రభుత్వానికి చేతకాలేదనే ఈర్ష్యతో మీరు మాట్లాడుతున్నారు.
నేనే పార్టీలో ఉన్నాను అని మీరే అడిగి కూటమి అని మీరే సమాధానం చెప్పుకున్నారు మీరు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వచ్చారు? కాంగ్రెస్ నుండి వైయస్సార్ సిపిలోకి మీరు మారలేదా? పార్టీలు మారడం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. గుళిగింత పూస గురించి మీరు చెప్పారు కానీ అది మీకే వర్తిస్తుంది ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మహిళని అని నన్ను కించపరచడానికి మీరు మాట్లాడకండి.
ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మీ దగ్గరకు ఒక్క మీడియా వారైనా వచ్చారా మీ దగ్గరకు. మీ వీడియోలు మీరే చేసుకునే దుస్దితికి వచ్చారని అర్ధం చేసుకోండి.
నా జోలికి గానీ నా కుటుంబం జోలికి గానీ వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఉన్నతమైన కుటుంబం నుండి వచ్చావని మీరే చెప్పారు. ఆ కుటుంబం అంతా నా వెనుక ఉంది కాబట్టి ఆలోచించుకుని మాట్లాడండి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


