Bharatiya Janata Party : భారతీయ జనతా పార్టీ డిండి మండల సమావేశం

TRINETHRAM NEWS
Bharatiya Janata Party Dindi

Bharatiya Janata Party : డిండి గుండ్ల పల్లి జూన్ 02, త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో గల ఈజే గార్డెన్ ఫంక్షన్ హాల్ లో బిజెపి మండల అధ్యక్షులు సింగారు సైదాజీ అధ్యక్షతన మండల సమావేశం మంగళవారం నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా మాజీ బీజేపీ నల్లగొండ పార్లమెంట్ కన్వీనర్ డిండి మండల ఇంచార్జ్ నక్క వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కు.ఆ ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది. ఆ ఆయుధానికి పదును పెట్టే కార్యక్రమమే ఈ SIR 2026దొంగ ఓట్లు, బోగస్ ఓట్లు లేని, 100% పారదర్శకమైన ఓటరు జాబితా తయారీయే ఈ సమగ్ర సవరణ లక్ష్యం.
డిండి మండలం లో ఒక్క అవకతవక ఓటు కూడా ఉండకూడదని మనం శపథం చేద్దాం. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జూన్ 25 నుండి జూలై 24 వరకు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికీ వచ్చి సర్వే నిర్వహిస్తారు. డిండి మండలంలోని ప్రతి గ్రామం, ప్రతి బూత్‌లో మన కార్యకర్తలు BLA లకు పూర్తిగా సహకరించాలి.
ముఖ్యంగా మూడు అంశాలపై దృష్టి పెట్టాలి. మొదటిది: 2026 అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి యువతీ, యువకుడి పేరు కొత్తగా ఓటరు జాబితాలో చేర్పించాలి. రెండవది: మరణించిన వారు, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను జాబితా నుండి తొలగించేలా చూడాలి. మూడవది: ఒకే వ్యక్తి పేరు రెండు చోట్ల ఉంటే గుర్తించి ఒక చోట మాత్రమే ఉంచాలి. గ్రామ శాఖలు, బూత్ కమిటీలు చురుకుగా పనిచేయాలి. ‘మన బూత్ – మన బాధ్యత’ అనే నినాదంతో ప్రతి కార్యకర్త పనిచేస్తే డిండి మండలం లో ఆదర్శవంతమైన ఓటరు జాబితా తయారు చేయగలం. పార్టీలకు అతీతంగా ప్రతి పౌరుడికి ఈ విషయం తెలియజేయడం మనందరి బాధ్యత” అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వానం నరేందర్ రెడ్డి అసెంబ్లీ కన్వీనర్ ఎ.టి కృష్ణ. చెల్లమల్ల ప్రవీణ్ కుమార్. కందుకూరు సర్పంచ్ బరపటి కొండల్ నల్లగాంతులవెంకటయ్య కుంభం రామకృష్ణ మాదరమోని అంజి సాయిగౌడ్ అమృత్ గాయాల రాఘవేందర్ సాయికుమార్ ముదిరాజ్. మోహన్ నాయక్ దండేడ్కర్ శీను. జోగు సైదులు. రాజేందర్ రెడ్డి. బోయ ఆంజనేయులు.బూత్ కమిటీ అధ్యక్షులు,వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top