జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 16 at 9.14.01 AM

TRINETHRAM NEWS

పత్రిక ప్రకటన
ది.16.01.2024

      భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గా మద్దిశెట్టి.


        భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షులు మరియు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే శ్రీ పోదెం వీరయ్య కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి మద్దిశెట్టి సామేలు గారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.  

        భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాపేట మండలం సరోజనపురం గ్రామానికి చెందిన మద్దిశెట్టి సామేలు గత 23 ఏళ్లుగా అణగారిన వర్గాల సంక్షేమ సంఘం మరియు భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ్ లో పదవుల్లో ఉంటు సామాజిక ప్రజా సేవ చేస్తూ....,670 గ్రామాలు 2 లక్షల మంది కార్యకర్తలు , నిరంతరం ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యలపై కొట్లాడుతూ, ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తిసుకెళ్తు ఎంతో పేరు తెచ్చుకున్నారు  మద్దిశెట్టి సామేలు....

          తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మరియు ఆర్ధిక, ప్లానింగ్ శాఖ మంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి సూచనల మేరకు ది.10.01.2024 నాడు హైదరాబద్ లో ఉన్న గాంధీభవన్ లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ sk. ఆఫ్సల్, ప్రచార కమిటీ ఛైర్మన్ మరియు మాజీ ఎంపీ శ్రీ మధుయాష్కీ గౌడ్, డీసీసీ అధ్యక్షులు మరియు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షులు శ్రీ పొదెం వీరయ్య టీవైజేఏసీ అధ్యక్షులు మద్దిశెట్టి అజయ్ బాబు గారి అధ్వర్యంలో మద్దిశెట్టి సామేలు గారి సేవలు పార్టీకి మరింత బలం చేకురుస్తాయని, వారు ఎన్నో ఏళ్లుగా చేస్తున్న ప్రజా సేవ, పోరాట స్ఫూర్తి, వారు ఉద్యమాలు దృష్టిలో ఉంచుకొని వారిని పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది.  


    అదే విధంగా  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ జనరల్ సెక్రెటరీ గా మద్దిశెట్టి సామేలు గారిని నియమించడం జరిగింది. వారినీ అధికారకంగా నియమిస్తూ నియామక పత్రాలు అందజేయడం జరిగింది. 

ఇట్లు
పొదెం వీరయ్య
టీపీసీసీ ఉపాధ్యక్షులు
మాజీ ఎమ్మెల్యే – భద్రాచలం.

You cannot copy content of this page