ఈ నెల 20న మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్.. ఎందుకంటే..?

TRINETHRAM NEWS

ఈ నెల 20న మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్.. ఎందుకంటే..?

స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వివో ‘స్విచాఫ్’ పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని చేస్తుంది. డిసెంబర్ 20వ తేదీన తమ కస్టమర్లు అందరూ వారి స్మార్ట్‌ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేయాలని విజ్ఞప్తి చేసింది.ఈ నెల 20న రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు కస్టమర్లు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలని కోరింది. కంపెనీ చేసిన ఓ సర్వేలో దాదాపు 77 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలు విపరీతంగా మొబైల్ యూస్ చేస్తున్నట్లు ఫిర్యాదు చేసినట్లు సంస్థ వెల్లడించింది. పెద్దవారికి సైతం ఫోన్ వ్యసనంగా మారిందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు, పిల్లలకు మధ్య రిలేషన్ దూరం ఏర్పడితే భవిష్యత్తులో సమాజానికి నష్టం జరుగుతుందని ఈ స్విచ్ ఆఫ్ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

You cannot copy content of this page

Scroll to Top