WhatsApp Image 2024 02 01 at 3.44.18 PM
Trinethram News : శ్రీకాకుళం జిల్లా ఫిబ్రవరి 01
ఎలుగుబంట్లు దాడిలో రైతులకు ఈరోజు తీవ్ర గాయాలు అయ్యాయి తెలిసిన వివరాల ప్రకారం..
శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం గడూరు, డెప్పురు గ్రామాల సమీపంలోని జీడి తోటల్లో పనిచేస్తున్న రైతులపై ఈరోజు ఉదయం రెండు ఎలుగుబంట్లు దాడికి పాల్పడ్డాయి.
ఈ దాడిలో లైసెట్టి నారాయణమ్మ, కుమారస్వామి, ఊర్మిళ, తాతారావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఎలుగుబంటి దాడిలో నారాయణమ్మకు రెండు కళ్ళుకోల్పోయింది.
గమనించిన స్థానికులు తీవ్ర గాయాలు పాలైన వారిని హుటాహుటిన పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..
