TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 4 : బాలనగర్ చెరబండ రాజు కాలనీలో వెలసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సంకట హర గణపతి సహిత విజయ దుర్గ ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం గత మూడు రోజులుగా ఘనంగా జరుగుతుంది .ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బండి రమేష్ గుడి కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి, లక్ష్మయ్య, పుష్ప రెడ్డి, కుక్కల రమేష్, మాదిరెడ్డి యుగేందర్ రెడ్డి, రాజేందర్, ఆకుల నరేందర్ ,కిట్టు, అనిల్, అస్లాం, అజాజ్, స్థానిక మహిళ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bandi Ramesh