TRINETHRAM NEWS

రేవంత్ రెడ్డి సవాల్ చేసి తోక ముడిచారు..

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సవాల్ విసిరే అర్హత ముఖ్యమంత్రికి లేదని, గతంలోనూ ఓ సవాల్ చేసి రేవంత్‌రెడ్డి తోక ముడిచారని అన్నారు. తాను కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రేవంత్ చెప్పారని.. కానీ ఆ మాట తప్పారని.. మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారని అన్నారు. ఇదే సమయంలో బాల్క సుమన్ కాంగ్రెస్ పార్టీకి ఓ సవాల్ విసిరారు. దమ్ముంటే రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించి.. పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, హామీలను నమ్మి జనం ఓటు వేస్తే.. ప్రభుత్వం వాళ్లకు శఠగోపం పెడుతోందని ఆరోపించారు. ఎన్నికల ముందు అందరికీ గృహజ్యోతి ఇస్తామని చెప్పి.. ఇప్పుడు కోతలు పెడుతున్నారని విమర్శించారు. తెల్ల రేషన్ కార్డ్ ఉన్న వాళ్లందరి