జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 29 at 20.20.15

TRINETHRAM NEWS

అయ్యన్న పాత్రునికికు మతి భ్రమించింది.
గిరిజనుల జోలికివస్తే అల్లూరి జిల్లా ముట్టడికి అఖిలపక్షం తొ సిద్ధం! కాంగ్రెస్ నాయకుడూ చిన్నాస్వామి.

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ జనవరి 30: అరకు నియోజకవర్గము ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పాచిపెంట చిన్నస్వామి మాట్లాడుతూ ఆదివాసులకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులు చట్టాల పైన ఒక బాధ్యత గల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్, చింతకాయల అయ్యన్నపాత్రుడు 1/70 చట్టం సవరించాలి గిరిజన ప్రాంతంలో త్రీ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్ ను కట్టాలి కోట్ల రూపాయల పెట్టుబడిదారులు రావటం లేదు,అంటే 1/70 చట్టం అడ్డు వస్తుంది,అని వ్యాక్యాలు చేయటం చాలా దురదృష్టకరం దీనిని అరకు కాంగ్రెస్ పార్టీ కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నాము, కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో గిరిజనులకు ఇచ్చిన హామీ జి ఓ నెంబర్ 3 చట్టబద్ధత కల్పించకుండా హామీలు నెరవేర్చకుండా మడమతిప్పి మాటమరచి పోయారు, అయ్యా స్పీకర్,

గిరిజన ప్రాంతం ఐదో షెడ్యూల్ భూభాగము గిరిజనులకు కవచము లాంటి ప్రత్యేకంగా గిరిజనులకు 1/70 చట్టం రాజ్యాంగము కల్పించింది మీరు దీనిని అవహేళన చేయాలనుకోవడం మీ బ్రహ్మ గిరిజనుల పైన మీ కూటమి రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధి ఉంటే గిరిజన యువతకు అటవీ ఉత్పత్తుల ద్వారా అడ్డాకుల పరిశ్రమ, మిర్యాల పరిశ్రమ, అల్లం పరిశ్రమ, కాపీ పరిశ్రమ, కుటీర పరిశ్రమలు అనేక రకాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించండి ఇవి చేయకపోగా, గిరిజనుల సంపద దోచి పెట్టడానికి బడాబడా వ్యాపారులకు గిరిజన ప్రాంతంలో ఉన్న అపారమైన ఖనిజ సంపదాలు కట్టబెట్టడానికి తమరు ఒప్పందాలు చేసుకున్నారు, అనుకుంటున్నాము, తమరు చేసిన వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకొని గిరిజనులకు క్షమాపణ చెప్పాలని అదేవిధంగా కూటమి, తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల గిరిజన నాయకులు తక్షణమేఈ విషం పైన స్పందించి మీ వైఖరి తెలియజేయాలనికాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శెట్టి భగత్ రామ్, డుంబ్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తడబారికి భీమరావు, యూత్ కాంగ్రెస్ నాయకుడు కిల్లో దశమత్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page