Awareness Seminar : నానో యూరియా వినియోగం పై రైతులకు అవగాహనా సదస్సు

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి)ఆగస్టు22, త్రినేత్రం న్యూస్ . డిండి మండల కేంద్రములోని పి ఏ సి ఎస్ వద్ద వ్యవసాయ నానో యూరియా వినియోగం పై అవగాహనా సదస్సు నిర్వహించడము జరిగిందని డిండి మండల వ్యవసాయ అధికారి రహేన ఒక ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భముగా వ్యవసాయ అధికారి తెలుపుతూ నానో యూరియావల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతదని తెలిపారు .నానో యూరియా ద్రవ రూపంలో చిన్న డబ్బాలో లభిస్తుంది. నిల్వ మరియు రవాణా సులభంగా ఉంటుంది.ఇందులో పంటలకు అవసరమైన నత్రజని సమృద్ధిగా లభిస్తుంది.

పంట దిగుబడి మరియు నాణ్యతను సాంప్రదాయ యూరియా కంటే నేల గాలి మరియు నీటి కాలుష్యం తగ్గిస్తుంది. సాంప్రదాయ యూరియా బస్తా రూ. 266 కాగా రూ.225 లకు వచ్చే నానో యూరియా అర లీటర్ డబ్బా ఎకరా పొలానికి సరిపోతుంది. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు అందించే నానో యూరియా పర్యావరణానికి కూడా మేలు చేస్తుందని వ్యవసాయ అధికారి రహేన తెలిపారు .ఈ కార్యక్రమములో అదనపు వ్యవసాయ అధికారులు రైతులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Awareness seminar for farmers

You cannot copy content of this page

Scroll to Top