Auto Seized : ఆటో పట్టివేత

TRINETHRAM NEWS

తేదీ : 03/07/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చేబ్రోలు మండలం, నారాకోడూరు గ్రామం సెంటర్ వద్ద అక్రమంగా తరలిస్తున్న బియ్యం ఆటోను గుంటూరు విజిలెన్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆటో డ్రైవర్ బొల్లెద్దు. శ్రీనివాసరావును అదుపులోకి తీసుకొని విచారించగా బాపట్ల జిల్లా, అమర్తులూరు మండలం ,ప్యాపర్రు గ్రామానికి చెందిన శ్యామ్ సునీల్ కొల్లూరులో రేషన్ బియ్యాన్ని లోడ్ చేయించి నారా కోడూరు తరలించాలని విచారణలో తేలింది.

ఆయనపై కేసు నమోదు చేసి రేషన్ ఆటోను చేబ్రోలు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అందులో డెబ్బై ఆరు బస్తాలు రేషన్ బియ్యం ఉన్నట్లు పోలీసులు తెలపడం జరిగింది. రేషన్ బియ్యాన్ని కంపెనీ ప్యాక్ చేసి తరలిస్తున్నట్లు గుర్తించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Auto seized

You cannot copy content of this page

Scroll to Top