Allocation of One Thousand Crores : వెయ్యి కోట్లు కేటాయింపు

TRINETHRAM NEWS

తేదీ : 03/07/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ సంవత్సర కాలంలో రూపాయలు వెయ్యి కోట్లు అభివృద్ధి పనుల కోసం కేటాయించినట్లు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ. వెంకట్రావు తెలిపారు. ఆయన విజయవాడ రూరల్ మండలం గూడవల్లి గ్రామంలో సుపరి పాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించిన ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలు గురించి కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో నిర్లక్ష్యానికి గురైన గ్రామాలను ఉమ్మడి కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందన్నారు.

రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను సమపాళ్లలో అమలు చేస్తూ ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా రైతుల వద్ద నుండి ధాన్యాన్ని కొనుగోలు చేసి సకాలంలో సొమ్ము చెల్లించి రైతుల అవసరాలను తీర్చినట్లు గుర్తుచేయడం జరిగింది. గత ప్రభుత్వం రైతుల రైతులకు బకాయి పెట్టిన ధాన్యం సొమ్ము రూపాయలు ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు ను తమ ప్రభుత్వం చెల్లించినట్లు వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృత నిశ్చయంతో ముందుకు సాగుతున్నారని రాష్ట్ర ప్రజలందరూ ఆయనకు మద్దతుగా నిలవాలని యార్లగడ్డ పిలుపునిచ్చారు.

తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఏడాది కాలంలో గన్నవరం నియోజకవర్గంలో రూపాయలు ఆరు వందల పద్నాలుగు కోట్లు ఖర్చుతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. నియోజకవర్గానికి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షులు జొన్నలగడ్డ. శ్రీనివాస్, యూనిట్ ఇంచార్జ్ యస్. సంతోష్ కుమార్, బి ఎల్ ఎ చంద్రశేఖర్ బాబు, టిడిపి నాయకులు జొన్నలగడ్డ. మంగపతి, నేర్సు. శ్రీకాంత్, రాజేష్, రాష్ట్ర నాయకులు చిరుమామిళ్ల. సూర్యనారాయణ ప్రసాద్, మండల అధ్యక్షులు గొడ్డల. చిన్న రామారావు, గుడువల్లి. నరసింహారావు, ముల్పురి. సాయి కళ్యాణి, దాసరి. మహేష్, కోనేరు. సందీప్, పరుచూరి. నరేష్, చల్లగాలి. సునీల్, కంచర్ల .సూర్య తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Allocation of one thousand

You cannot copy content of this page

Scroll to Top