Dark Day : ఆగస్టు 1 మాలలకు చీకటి రోజు

TRINETHRAM NEWS

ఎస్సీ వర్గీకరణ పై ఆగస్టు 1 2024 సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అన్ని తీర్పు ఇచ్చిన ఈ రోజును బ్లాక్ డే పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ బీ. ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు వనపర్తి జిల్లా అధ్యక్షుడు మొలకలపల్లి మద్దిలేటి, జిల్లా కమిటీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. వర్గీకరణ వల్ల మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, విద్యా ఉద్యోగ అవకాశాల్లో వెనకబడిపోయారని ఈ తీర్పు రాజ్యాంగ విరుద్ధమని మొలకలపల్లి మద్దిలేటి పేర్కొన్నారు . అనంతరం అంబేద్కర్ కి రోస్టర్ పాయింట్లలో జరుగుతున్న అన్యాయం అదేవిధంగా డిగ్రీ, ఎంసెట్, బిఈడి, పీజీ,PHD ప్రవేశాలలో వర్గీకరణ అమలు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వర్గీకరణ కంటే ముందే వచ్చిన నోటిఫికేషన్లలో ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.

తక్షణమే ప్రవేశ నోటిఫికేషన్ లలో వర్గీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా దళితులపై జరుగుతున్న దాడులను ఖండించారు. వర్గీకరణ ఇదేవిధంగా అమలు చేస్తే మాలలు చదువు, ఉద్యోగ అవకాశాలు దూరమయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ వివిధ అంశాలపై అంబేద్కర్ కి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజ్జా సహదేవుడు, బర్కమ్ రమేష్, చిన్న దాసు, దేవరాజు, నాగరాజు, అన్నలదాసు రమేష్, బీజ్జా వెంకటేష్, పెద్ద దాసు, దాసరి బాబు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

dark day

You cannot copy content of this page

Scroll to Top