Trinethram News : హైదరాబాద్: నాలుగోరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. దివంగత మాజీ ఎమ్మెల్యేలు మశ్చేందర్రావు, పి నర్సారెడ్డి, బిరుదు రాజమల్లుకు సభ సంతాపం తెలిపింది. అనంతరం హుక్కా పార్లర్లపై నిషేధానికి సంబంధించి సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ అమెండ్‌మెంట్ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున మంత్రి శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెట్టారు. ఎలాంటి చర్చలేకుండానే బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.కాగా, కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకీ అప్పగించట్లేదని ప్రభుత్వం సభతో తీర్మానం ప్రవేశపెట్టనుంది. ఈ నేపథంలో కృష్ణానది ప్రాజెక్టులపై వాస్తవాలు.. గత ప్రభుత్వ తప్పిదాల పేరుతో నోట్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఇదే విషయమై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. దీంతో అధికారులు రెండు స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అయితే తమకు కూడా పీపీటీ అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు విజ్ఞప్తి చేశారు.
హుక్కా పార్లర్లపై నిషేధంపై బిల్లు.. అసెంబ్లీ ఆమోదం
Related Posts
జర్నలిస్ట్ లు ఆరోగ్యంపై శ్రద్ద చూపాలి : ఐఎంఏ ప్రెసిడెంట్ క్యాస శ్రీనివాస్
TRINETHRAM NEWS జర్నలిస్ట్ లు ఆరోగ్యంపై శ్రద్ద చూపాలి : ఐఎంఏ ప్రెసిడెంట్ క్యాస శ్రీనివాస్ గోదావరిఖని : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని నిత్యంప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం కాలంతో పోటీపడుతూ ఒత్తిడిలో పనిచేసే జర్నలిస్ట్ లు తమ ఆరోగ్యంపై…
బిజెపి కార్యక్రమాలకి చిరంజీవికి ఆహ్వానం అందుకే..! సంచలన కామెంట్ చేసిన కిషన్ రెడ్డి
TRINETHRAM NEWS బిజెపి కార్యక్రమాలకి చిరంజీవికి ఆహ్వానం అందుకే..! సంచలన కామెంట్ చేసిన కిషన్ రెడ్డి Trinethram News : Telangana : మెగా స్టార్ చిరంజీవి వరుసగా సినిమాలను లైనప్ చేసి ఆ షూటింగ్స్ తో బిజీగా గడుపుతున్నారు. ఓ…