జూన్ 27, 2026

WhatsApp Image 2025 01 29 at 18.26.40

TRINETHRAM NEWS

ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు బ్యాంకు ఏర్పాటుకు అనుమతులుతీసుకువచ్చాను

మాజీ ఉపముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం హరి

స్టేషన్ ఘనపూర్ త్రినేత్రం న్యూస్ త్రినేత్రంన్యూస్

జఫర్ గడ్ మండల కేంద్రంలో మంజూరు అయిన బ్యాంక్ అఫ్ బరోడా బ్రాంచ్ ఏర్పాటుకు కావాల్సిన భవనాలను సంబంధిత బ్యాంక్ ఆర్ఎం, బ్రాంచ్ మేనేజర్ ఇతర అధికారులతో కలిసి మాజీ ఉప ముఖ్య మంత్రి ఎమ్మెల్యే కడియం హరి పరిశీలించడం జరిగింది ఎమ్మెల్యే మాట్లాడుతూ దాదాపు 35ఏళ్ల తర్వాత జఫర్ గడ్ మండల కేంద్రంలో బ్యాంక్ ఏర్పాటు కాబోతుందని తెలిపారు.

జఫర్ గడ్ మండల ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అనేక సార్లు బ్యాంక్ అధికారుల వద్దకు వెళ్లి పలుసార్లు విజ్ఞప్తి చేయగా బ్యాంక్ అఫ్ బరోడా బ్రాంచ్ ఏర్పాటుకు ముందుకు వచ్చిందని తెలిపారు బ్రాంచ్ ఏర్పాటుకు సంబందించి ఆర్బీఐ అనుమతులు వచ్చాయని అన్నారు జఫర్గడ్ మండలంలో బ్యాంక్ అఫ్ బరోడా బ్రాంచ్ ఏర్పాటుకు మండల కేంద్రంలోని పాత గ్రామ పంచాయతీ భవనాన్ని మరియు మరో రెండు భవనాలను పరిశీలించం అందులో మెయిన్ రోడ్డుపై నిర్మాణంలో ఉన్న భవనంలో బ్యాంక్ ఏర్పాటు చేసేందుకు అధికారులు అంగీకరించారు వెంటనే భవన యజమానితో మాట్లాడి బ్యాంక్ ఏర్పాటుకు అవసరమైన పనులను వెంటనే పూర్తిచెయాలని సూచించారు బ్యాంక్ అధికారులు భవనయాజమాని సమన్వయంతో త్వరితగతిన పనులు పూర్తి చేసి ఫిబ్రవరి 24న బ్యాంక్ ప్రారంభోత్సవం అయ్యే విధంగా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page