As part of Saranavaratra, Devi Navratra started in Mandal with grandeur
చొప్పదండి : త్రి నేత్రం న్యూస్
పట్టణ పరిధి లోని విశ్వ బ్రాహ్మణ వీధిలో శ్రీ మహా శక్తి యూత్ క్లబ్ అద్వర్యం లో మొదటి సారి శ్రీ దుర్గా మాత ను నెలకొల్పి పూజలను నిర్వహించారు. మిరుమిట్లు గొలిపేలా మండపాన్ని విద్యుత్ ది పాలతో సుందరంగా తీర్చి దిద్ది అందులో అమ్మవారి ప్రతిమను పెట్టారు. ఈ సందర్బంగా నిర్వాకులు మాట్లాడుతూ దేవి నవరాత్రులు అత్యంత భక్తి, శ్రద్దలతో నియమ నిబంధనలతో నిర్వహిస్తున్నామని మేము కోరిన కోరికలు నెరవేరుతున్నాయని అన్నారు. ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారు తొమ్మిది అవతారాల రూపంలో అలంకరిస్తామని ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఆయా రోజును బట్టి ప్రసాదంగా పులిహార, లడ్డు, చక్ర పొంగలి, బెల్లపు పొంగలి, శెనిగలు, నివేదనగా సమర్పించడం తో పాటు ఈ తొమ్మిది రోజులు ఆయా రోజును బట్టి తొమ్మిది రకాల చీరలతో అమ్మవారిని అలకరిస్తున్నట్లు తెలిపారు. మొదటి రోజున ఉత్తర భారతంలో కలశాన్ని ప్రతిష్టించి, శైలపుత్రి దేవిని గా పూజించారు. ఈ రోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు.
రెండోరోజు అమ్మవారు వేదమాత శ్రీ గాయత్రీ దేవిగా, మూడో రోజు అమ్మవారు ప్రాణకోటి ఆకలి తీర్చే అన్నపూర్ణ మాతగా, నాలుగోరోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, ఐదో రోజు అమ్మవారు శ్రీ చండీ దేవిగా, ఆరో రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవిగా, ఏడో రోజు అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో, ఎనిమిదో రోజు దుర్గాష్టమి అమ్మవారు ఈ రోజున దుర్గతులను రూపుమాపే దుర్గావతారంలో తొమ్మిదో రోజు మహర్నవమి. ఈ రోజున అమ్మవారు మహిషాసుర మర్ధినిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు నిర్వాకులు మహ శక్తి యూత్ సభ్యులు తెలిపారు. చివరి రోజు అమ్మవారిని డప్పు చప్పుళ్లతో బాజా బజంత్రీల కోలాట నృత్యాలతో రథం పై గ్రామా ప్రధాన వీధుల గుండా శోభా యాత్ర నిర్వహించనున్నట్లు శ్రీ మహా శక్తి యూత్ క్లబ్ తెలిపారు. శుక్రవారం రోజు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App