జూన్ 26, 2026

WhatsApp Image 2023 12 21 at 6.15.19 PM

TRINETHRAM NEWS

జగనన్న జన్మదినం వేడుకల్లో భాగంగా లోతుగెడ్డ తులసీ వర ప్రసాద్ ఆధ్వర్యంలో మెలియాపుట్టి హెడ్ క్వార్టర్ లో రామాలయంలో ఉచిత మెడికల్ క్యాంప్

పాతపట్నం నియోజకవర్గం మెళియపుట్టి మండలం రామాలయంలో ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీ కోశాధికారి లోతుగెడ్డ తులసి వర ప్రసాద్ రావు ముఖ్య అతిథిగా మల్లేటి శ్రీనువాసచారి ఆధ్వర్యంలో జెమ్స్ హాస్పిటల్ వారిచే ఉచిత మెడికల్ క్యాంప్ ప్రారంభించడం జరిగింది.

ఈ మెడికల్ క్యాంప్ లో ప్రతి ఒక్కరికి తులసి వరప్రసాద్ రావు గారి చేతుల మీదుగా నాణ్యమైన ఉచిత మందులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అలాగే డాక్టర్లు పేషెంట్ల మధ్యన కేక్ కట్ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో లోతుగడ్డ తులసి వరప్రసాద రావు మాట్లాడుతూ వైద్య రంగాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో రకాలు పథకాలు పెట్టి పేదలకు ఉచిత వైద్యం ఇంటికే అందించారు ఉచిత మందులు కూడా ఇంటికే అందించారు .
ఇటువంటి ముఖ్యమంత్రి దొరకడం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టమని లోతుగడ్డ తులసి వరప్రసాద్ రావు అన్నారు.

కార్యక్రమంలో ముల్లేటి శ్రీనివాసరావు, పాడి కృష్ణారావు, గండేటి చిన్నారావు, పాడి వెంకటేష్, బండార వెంకటేష్, కురుమోజు జానకిరామ్, బసవ రమణమూర్తి, కోయిలపు సంజీవరావు, చల్ల ధర్మారావు, ఆగతముడి నాగేశ్వరరావు, వడమ శ్రీనివాసరావు , శేపాన విక్రమ్, మొదలగువారు పాల్గొన్నారు.

You cannot copy content of this page