
రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరంలో నిర్వహించిన “అమరావతి చిత్రకళా వీధి – ఆంధ్రస్ మోస్ట్ వైబ్రంట్ ఆర్ట్ ఫెస్టివల్” కు విశేష స్పందన వచ్చిందని, అద్భుతమైన కళారూపాలు ప్రదర్శింపబడ్డాయని వీసీ ఆచార్య ఎస్ ప్రసన్న శ్రీ అన్నారు. శుక్రవారం అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమ ప్రారంభోత్సవానికి హాజరైన వీసీ చిత్రకళా ప్రదర్శనలను సందర్శించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారులు ఎంతో నైపుణ్యంతో గీసిన చిత్రాలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా రాజమహేంద్రవరం కేంద్రకారాగారం వారు ఏర్పాటు చేసిన స్టాల్ ను సందర్శించి ఖైదీల సైతం ఎంతో నైపుణ్యంతో చిత్రలేఖనాలను వేయడం విశేషం అన్నారు.
చక్కని కార్యక్రమాన్ని నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృత శాఖ నిర్వహకులను అభినందించారు. యూనివర్సిటీ ఎన్.ఎస్.ఎస్. విభాగం నుండి సహకారం అందించిన 120 మంది వాలంటీర్లను అభినందించారు. అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశ్వవిద్యాలయం నుండి 38 మంది కళాకారులు, వివిధ ఆర్ట్స్ ను ప్రదర్శించేందుకు 12 మంది కళాకారులు, హస్తకళలను ప్రదర్శించేందుకు ఏడుగురు విశ్వవిద్యాలయం నుండి హాజరయ్యారని విద్యార్థులందరిని అభినందించారు.
కమిషన్ చైర్ పర్సన్ తేజస్వి కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు మంత్రి కందులు దుర్గేష్ వీసీ ప్రసన్న శ్రీ కి జ్ఞాపకం అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ పి.ఆర్.వో. ఆనంద్, ఎన్.ఎస్.ఎస్. కోఆర్డినేటర్ డా.పి.వెంకటేశ్వరరావు, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ఎం.గోపాలకృష్ణ, ఎ.ఎం.శిరీషా, ఎల్.సుజాత, ఎస్.రాజ్యలక్ష్మీ, ఎల్.ముత్యాలనాయుడు, కె.రాజరాజేశ్వరిదేవి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
