Abhyudaya Helping Hands : అభ్యుదయ హెల్పింగ్ హాండ్స్ ద్వారా ఆడబిడ్డ పెళ్లికి 18050/- రూపాయల కిరాణా సరుకులు అందిజేత

TRINETHRAM NEWS

ప్రతి పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు అభ్యుదయ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ ద్వారా పెద్దన్నలా అండగా ఉంటాం : జాటోత్ దవిత్ కుమార్ (లింగాపూర్ మండల ఇంచార్జి)

సామాజిక సేవలే ప్రధానం – సహాయమే మా సారథ్యం : జాధవ్ సుశీల్, జాధవ్ మారుతీ (అభ్యుదయ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ గౌరవ సభ్యులు లింగాపూర్)

Trinethram News : లింగాపూర్ : లింగాపూర్ మండల కేంద్రంలోని సామాన్య నిరుపేద కుటుంబం జాధవ్ కమలా బాయి అంబాజి దంపతుల తృతీయ కుమార్తె జాధవ్ సుప్రియా వివాహానికి ఆర్థిక భరోసాగా అభ్యుదయ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ అండగా నిలిచింది. జాధవ్ కైలాష్ (స్త్రీనిధి), డాక్టర్ రాథోడ్ రాజ శేఖర్, జాధవ్ అశోక్, చవాన్ శివా, జాధవ్ జైల్సింగ్, జాధవ్ శ్రీనివాస్ (హ్యూమన్ రైట్స్ చైర్మన్ లింగాపూర్ మండలం), డాక్టర్ రాథోడ్ రాజ శేఖర్, రాథోడ్ రవీందర్ (తృతీయ శ్రేణి సహాయ అధికారి తహసీల్దార్ కార్యాలయం లింగాపూర్ మండలం), జాధవ్ గణేష్, జాధవ్ నవీన్, పార్డే ధమ్మా, పార్దే కిరణ్, టిగోటే అరుణ్, మగ్రె సుమిత్ (ఎన్.ఆర్.ఐ టాంజానియా), ఆడే ప్రవీణ్ కుమార్ (ఎన్.ఆర్.ఐ దుబాయ్), పవార్ దినేష్, పవార్ ధనరాజ్, రాథోడ్ మహేష్ (బౌన్సర్) సహకారంతో శుక్రవారం 18,050/- రూపాయల కిరాణా సరుకులు జాటోత్ దవిత్ కుమార్ చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

ఫౌండేషన్ వంతు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆ ఇంట్లో ఐదుగురు (5 గురు) ఆడపిల్లలు ఉండంతో ఆ ఆడబిడ్డల తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకొని, సాటి కుటుంబానికి పెద్దన్నలా అండగా నిలబడాలనే మానవతా దృక్పధంతోనే ఈ సహాయాన్ని అందించడం జరిగిందని జాటోత్ దవిత్ కుమార్ తెలిపారు. ఆడపిల్లలను ఎవరు భారంగా భావించవద్దని, స్వచ్చంద సామాజిక సేవకులు నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసాగా ముందుకు రావాలని తెలిపారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు అభ్యుదయ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ సభ్యుల ఆదేశాల మేరకు లింగాపూర్ మండల ఇంచార్జి జాటోత్ దవిత్ కుమార్ చేస్తున్న కృషిని కుటుంబ సభ్యులు సంతోషించారు. ఈ కార్యక్రమంలో జాధవ్ ప్రశాంత్, సుశాంత్, రంగిబాయి లింగన్న, దేవిదాష్ మహారాజ్, జాధవ్ గజానంద్, కైలాష్, పవార్ ధన్రాజ్, జాధవ్ ధర్మెందర్, చవాన్ విజేష్, జాధవ్ ఆకాష్, ఆడే అవినాష్, ఆడే కేతన్, రాథోడ్ సంతోష్ తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Abhyudaya Helping Hands provides

You cannot copy content of this page

Scroll to Top