Arrangements for Group-1 Preliminary Examination Completed – Peddapally Regional Coordinator Dr. K. Lakshmi Narsaiah
పెద్దపల్లి, జూన్ -08: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
జూన్ 9న ఆదివారం నిర్వహించబడే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష కోసం పెద్దపెల్లి జిల్లా పరిధిలోని 14 సెంటర్లలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పెద్దపల్లి రీజనల్ కో-ఆర్డినేటర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.లక్ష్మీ నర్సయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
గ్రూప్-1 పరీక్షకు పెద్దపల్లి జిల్లా పరిధిలోని పెద్దపల్లిలో 6, సుల్తానాబాద్ లో 2, రామగిరిలో ఒకటి, రామగుండంలో 5 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, మొత్తం 6098 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలుపుతూ,పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ తెలియజేసిన సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను ఉదయం 9 గంటల నుండి పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుందని, 10 గంటల లోపే పరీక్షా కేంద్రం లోపలికి చేరుకోవాలని, 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లభించదని తెలియజేసారు.
అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ఐడి కార్డ్, మూడు ఫోటోలు తీసుకురావాలని, షూస్ ధరించకుండా కేవలం చెప్పులు ధరించి రావాలని, బయో మెట్రిక్ అటెండెన్స్ ఉన్నందున అభ్యర్థులు ఎవరు కూడా మెహందీ,కోన్ లాంటివి లేకుండా చూసుకొని పరీక్షా కేంద్ర సిబ్బందికి సహకరించాలని కోరారు. పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్, చేతి గడియారాలు, సెల్ ఫోన్లు తీసుకొని వెళ్ళడానికి అనుమతి లేదని, ఉదయం 9 గంటల లోగా పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు చేరుకోవాలని పెద్దపల్లి రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ కె.లక్ష్మీ నర్సయ్య ఆ ప్రకటనలో కోరారు
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App