సెప్టెంబర్ 19, 2026

WhatsApp Image 2024 11 19 at 3.12.33 PM

TRINETHRAM NEWS

పేదల ఆరోగ్య పెన్నిధి….ముఖ్యమంత్రి సహాయ నిధి : ఎమ్మెల్యే కెపి. వివేకానంద్

Trinethram News : Medchal : ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద 131- కుత్బుల్లాపూర్ డివిజన్ వాజ్ పేయ్ నగర్ కు చెందిన ఎస్. హర్షిణి అనే చిన్నారి(11)కి వైద్యచికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 2.00 లక్షల రూపాయల ఎల్ఓసి చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అందజేశారు.

వివరాల్లోకి వెళితే… గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యతో బేబీ ఎస్.హర్షిణి (11) అనే వ్యక్తి బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2.00 లక్షల రూపాయల చెక్కును మంజూరు చేయించి బాధిత కుటుంబ సభ్యులకు ఈరోజు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి వివేకానంద మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి అనారోగ్యంతో బాధపడుతూ ఆపదలో ఉన్న నిరుపేదలకు వరం లాంటిదన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న అర్హులైన నిరుపేదలు ఈ ముఖ్యమంత్రి సహాయ నిధిని వినియోగించుకోవాలన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page