WhatsApp Image 2024 11 19 at 4.08.05 PM
మంజీరా నీటి సరఫరా సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ కి వినతి పత్రం….
Trinethram News : Medchal : ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద 125 – గాజుల రామారం డివిజన్ లాల్ సాహెబ్ గూడ ఫేజ్ -2, కైసర్ నగర్ వాసులు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని కలిసి కాలనీలో నెలకొని ఉన్న మంజీరా నీటి సమస్యపై వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రజల మంచి నీటి కష్టాలను తీర్చేందుకు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మంజీరా నీటి పైప్ లైన్ ను వేయించగా ఎన్నికల కోడ్ తో మంజీరా నీటి మెయిన్ లైన్ కు కాలనీ కి వచ్చే కనెక్షన్ ను కలపకపోవడంతో మంజీరా నీటి సరఫరా లేక నేటికీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు.
అనంతరం ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ఫోన్ ద్వారా జలమండలి అధికారులతో మాట్లాడుతూ కాలనీలలో లక్షల రూపాయలను వెచ్చించి చేపట్టిన మంజీరా నీటి పైప్లైన్ ను వెంటనే మెయిన్ లైన్ కు కలిపి ప్రజలు ఎదుర్కొంటున్న మంజీరా నీటి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు అజయ్ గుప్తా, సీనియర్ నాయకులు సాయిబాబా, రసూల్ బాయ్, సురేష్, ఉషన్ బీ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
