లోయలో పడిన ఆర్మీ వాహనం.. నలుగురు సైనికులు మృతి
Trinethram News : జమ్ము కశ్మీర్ : Jan 04, 2025,
జమ్ము కశ్మీర్‌లోని బందిపూర్ జిల్లాలో శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్మీ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు సైనికులు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని సదర్ కూట్ పాయెన్ సమీపంలోని ఓ మలుపు వద్ద డ్రైవర్ వాహన నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. అప్రత్తమైన భద్రతా బలగాలు, పోలీసు సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App