అనంతగిరి, నవంబర్ 27 (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం జీనబాడు గ్రామ పరిధిలోని రైవాడ రిజర్వ్ డాంలో ఆదివారం చోటుచేసుకున్న విషాద ఘటనలో నాటు పడవ బోల్తా పడి ముగ్గురు గిరిజన యువకులు గల్లంతైన ఘటనకు సంబంధించి గాలింపు చర్యల్లో పోలీసులు అడుగడుగునా మానవత్వం చాటుకున్నారు.
విషయం తెలుసుకున్న వెంటనే అరకు సీఐ ఎల్. హిమగిరి స్పందించి అనంతగిరి పోలీసు సిబ్బంది, ఎస్‌డిఆర్ఎఫ్ బృందాలు, రెవెన్యూ అధికారులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మూడు రోజుల పాటు నిరంతరంగా డాంలోనే తరిచి, కష్టతర పరిస్థితుల్లో మూడు మృతదేహాలను వెలికితీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
తరువాత సీఐ హిమగిరి మృతుల కుటుంబాలను వ్యక్తిగతంగా సందర్శించి వారి ఆర్థిక పరిస్థితులను పరిశీలించారు. మానవత్వం నిండిన హృదయంతో ప్రతి కుటుంబానికి ₹5,000 చొప్పున మొత్తం ₹15,000 ఆర్థిక సాయం అందించారు. పోలీసు పరిరక్షణతో పాటు మానవత్వం కలగలిపిన ఈ సేవలు స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందించారు.
మూడు యువకుల మృతితో ప్రాంతంలో విషాద ఛాయలు నెలకొన్నా, గాలింపు కార్యక్రమంలో పోలీసులు చూపిన అపారమైన సేవాభావం స్థానికంగా విశేషంగా ప్రశంసలు పొందారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


