
త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం. రంగంపేట మండలం సింగంపల్లి, దాతృత్వాన్ని ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని ఏపీ ఆర్ సి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు పిలుపునిచ్చారు. రంగంపేట మండలం, సింగంపల్లి గ్రామం, సి పి రెడ్డి నగర్ లో ఇటీవల హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన షేక్ నాగూర్ కుటుంబాన్ని ఏపీ ఆర్ సి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు నేతృత్వంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వల్లూరి రాజబాబు, బి రమేష్, ఏ ఐ ఎఫ్ టి యు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కుంచె అంజిబాబు లు సందర్శించి నాగూర్ భార్య మున్ని, వారి పిల్లలు సలీం, రియాన్ లను కలిసి 50 కేజీల బియ్యం కొంత నగదును బాధిత కుటుంబానికి సహకారంగా అందించారు.
ఈ సందర్భంగా ఏపీ ఆర్ సి ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ నాగూర్ ఆటో కార్మికుడిగా పనిచేస్తూ తన కుటుంబాన్ని సాదుకుంటూ జీవిస్తున్నారని, వారు నిరుపేదలని, రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సాధించిన సీపీ రెడ్డి నగర్ లో చిన్న గుడిసె వేసుకొని జీవిస్తున్నారన్నారు. అతను హఠాత్తుగా మరణించడంతో వారి కుటుంబం రోడ్డున పడిందన్నారు. ఏపీ ఆర్ సి ఎస్, ఏ ఐ ఎఫ్ టు యు సంఘాల నాయకులు 50 కేజీలు బియ్యం, కొంత నగదును జమ చేసి వారి కుటుంబానికి సహకారంగా ఇవ్వడం జరిగింది అన్నారు. ప్రతి ఒక్కరూ దాతృత్వంతో ఆపదలో ఉన్న వారికి సహకరించే మనసు కలిగి ఉండాలి అన్నారు. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని, విడో పెన్షన్ ఇప్పిచ్చి, ఆర్థిక సహకారాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్ సి ఎస్ నాయకులు దేశట్ సురేష్, చెక్కా సత్తిబాబు, వల్లూరి సత్తిబాబు, రాయుడు కన్నబాబు, తదితరులు పాల్గొన్నారు.
వల్లూరి రాజబాబు,
ఉమ్మడి జిల్లా అధ్యక్షులు,
ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం (ఏ పి ఆర్ సి స్ )
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
