TRINETHRAM NEWS

నూత‌న పారిశ్రామిక కారిడార్ ప్ర‌తిపాద‌న‌ను ఆమోదించండి.

Trinethram News : హైద‌రాబాద్‌-నాగ్‌పూర్ కారిడార్‌కు తుది అనుమతులు ఇవ్వండి * రాష్ట్రానికి ఎన్‌డీసీ, మెగా లెద‌ర్ పార్క్‌, ఐఐహెచ్‌టీ మంజూరు చేయండి * కేంద్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి న్యూఢిల్లీ: హైద‌రాబాద్ వ‌యా మిర్యాల‌గూడ -విజ‌య‌వాడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. హైద‌రాబాద్‌-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు కేంద్ర ప్ర‌భుత్వం తుది అనుమ‌తులు మంజూరు చేయాలని కోరారు.

కేంద్రం తుది అనుమ‌తులు మంజూరు చేస్తే రాష్ట్రానికి రూ.2,300 కోట్లు విడుద‌లవుతాయ‌న్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ఆయ‌న కార్యాల‌యంలో శ‌నివారం స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి సంబంధించిన ప‌లు స‌మ‌స్య‌ల‌ను ముఖ్య‌మంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హైద‌రాబాద్‌-వ‌రంగ‌ల్ పారిశ్రామిక కారిడార్‌లో ప్రాధాన్య అంశంగా ఫార్మా సిటీని గ‌త ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించింద‌ని, దానిని ఉప సంహ‌రించుకొని నూత‌న ప్ర‌తిపాద‌న‌లు పంపేందుకు అనుమ‌తించాల‌ని కేంద్ర మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు.

యూపీఏ ప్ర‌భుత్వ హ‌యాంలో హైద‌రాబాద్‌కు నేష‌న‌ల్ డిజైన్ సెంట‌ర్ (ఎన్ఐడీ) మంజూరు చేసింద‌ని, నాటి కేంద్ర మంత్రి ఆనంద్ శ‌ర్మ దానికి శంకుస్థాప‌న చేశార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి గోయ‌ల్‌కు గుర్తు చేశారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఎన్ఐడీని విజ‌య‌వాడ‌కు త‌ర‌లించార‌ని, ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌కు ఎన్ఐడీ మంజూరు చేయాల‌ని కోరారు. ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్న‌ప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం నెల్లూరు జిల్లాకు మెగా లెద‌ర్ పార్క్ మంజూరు చేసింద‌ని కేంద్ర మంత్రి