జూన్ 26, 2026

IMG 20241118 WA0022

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా కమిటీ నియామకం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
జిల్లా అధ్యక్షులుగా కాలే సురేందర్ , ప్రధాన కార్యదర్శిగా ముత్తరగల్లప్రభాకర్.*నియామక ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళభద్రయ్య.వికారాబాద్ జిల్లా : జాతీయ మానవ హక్కుల కమిటీ ఎన్ హెచ్ ఆర్ సి నేషనల్ చైర్మన్ స్వప్న యం ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లాకమిటీనియామకఉత్తర్వులను రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య జారీ చేశారని రాష్ట్ర కమిటీ సభ్యులు బేగరి నర్సిములు తెలిపారు. జిల్లా అధ్యక్షులుగా నవాబుపేట మండలానికి చెందిన కాలే సురేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వికారాబాద్ మండలానికి చెందిన ముత్తగల్ల ప్రభాకర్, ఉపాధ్యక్షులుగా తాండూరు మండలానికి చెందిన బి. వెంకటేష్, శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శిగా దౌల్తాబాద్ మండలానికి చెందిన ఎస్ వెంకటేష్, మర్పల్లి మండలానికి చెందిన పి శ్రీనివాస్, ప్రచార కార్యదర్శిగా కే శేఖర్, అధికార ప్రతినిధిగా పూడూరుమండలానికి చెందిన ఎం అరుణ్ లనునియమించి నియామక పత్రాలు జారీ చేసినట్లు రాష్ట్ర కమిటీ సభ్యులుబేగరి.నర్సిములు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ హక్కులు విధుల పట్ల తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్ర జిల్లా కమిటీల ఆదేశాల మేరకు పనిచేయాలని నూతన జిల్లా కమిటీకి సూచించారు. అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం కృషి చేయాలని అన్నారు. నూతనంగా నియామకమైన వికారాబాద్ జిల్లా కమిటీ అధ్యక్షులు కాలే సురేందర్, ప్రధాన కార్యదర్శి ముత్తగల్ల ప్రభాకర్ మాట్లాడుతూ మా నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్య, పాటి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఇంజం సాంబశివరావు, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ పాముల నారాయణ,రాష్ట్ర కమిటీ సభ్యులు బేగరీ.నర్సిములు కు కృతజ్ఞతలు తెలుపుతూ అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం మాకిచ్చిన బాధ్యతలను సక్రమంగా నీతి నిజాయితీతో నిర్వహిస్తు రాష్ట్ర కమిటీకి లోబడి పనిచేస్తామన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్రఅధ్యక్షులు డా. మొగుళ్ళ భద్రయ్య కు రాష్ట్ర కమిటి సభ్యులుబేగరి.నర్సిములు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page