అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు దరఖాస్తులు..
Trinethram News : శ్రీకాకుళం జిల్లా
భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బి.వి. ప్రసాదరావు, ముఖ్య కార్యనిర్వహణాధికారి, యువజన సర్వీసుల శాఖ / సెట్ శ్రీకాకుళం వారు తెలిపారు..
ఇంటర్మీడియట్ / 10వ తరగతి 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల నుంచి 2025 జనవరి 07 నుంచి 2025 జనవరి 27వ తేదీ సాయంత్రం 5 గం.లోగా https://agnipathvayu.cdac.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. ఇతర వివరములకు భారత వాయుసేన వారి వెబ్ సైట్ ను సందర్శించగలరు..
2005 జనవరి 1వ తేది నుండి 2008 జూలై 1వ తేది మధ్య పుట్టిన అవివాహిత పురుష మరియు మహిళా అభ్యర్ధులు మాత్రమే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. ఆన్లైన్ టెస్టుకు 3 రోజుల ముందు అర్హత పరీక్ష అడ్మిట్ కార్డులు అభ్యర్థుల వ్యక్తిగత ఈ-మెయిల్సుకు వస్తాయని చెప్పారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App