WhatsApp Image 2024 09 30 at 17.45.20
Appeal to BRS representatives, leaders, activists, farmers
రామగుండం నియోజకవర్గం
బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు నాయకులకు ఉద్యమకారులకు రైతులకు విజ్ఞప్తి
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విధంగా రెండు లక్షల రైతు రుణమాఫీ చేయాలని ,రైతు భరోసా ను వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని కోరుతూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రుణమాఫీ కానీ రైతులతో అక్టోబర్ ఒకటో తేదీన మంగళవారం 11.00 గంటలకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వినతి పత్రం అందచేసే కార్యక్రమం ఉంది , ఏలాంటి సాంకేతిక లోపాలు వున్న వెంటనే సవరించి రెండు లక్షల రూపాయల రుణమాఫీ కానీ రైతులకు రుణమాఫీ చేయాలని కోరడము జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో కొప్పుల ఈశ్వర్ అన్న మాజీ మంత్రి వర్యులు. మనోహర్ రెడ్డి పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు పుట్ట మధుకర్.మాజీ మంథని శాసన సభ్యులు మాజీ ప్రజాపతినిదులు పాల్గొంటారు.
కాబట్టి రుణమాఫీ కానీ రైతులందరినీ తీసుకొని కలెక్టర్ కార్యాలయానికి సకాలంలో హాజరై మీరు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి
