అపరమేధావి డాక్టర్ గుగ్గిళ్ళ దివ్యమూర్తికి కృష్ణాజిల్లాలో ఘనంగా సన్మానం

TRINETHRAM NEWS

Trinethram News : ఖమ్మంజిల్లా నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు గ్రామానికి చెందిన డాక్టర్ గుగ్గిళ్ళ దివ్యమూర్తికి కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరులో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా సన్మానం జరిగింది. గుడ్లవల్లేరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన మోటివేషనల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అపరమేధావి డాక్టర్ గుగ్గిళ్ళ దివ్యమూర్తి వెళ్లడం జరిగింది. నేటి పిల్లలే రేపటి భావిభారత పౌరులని విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్ దివ్యమూర్తి చక్కటి ప్రసంగాన్ని ఇచ్చారు. ఇప్పటివరకు తనకు 81 చోట్ల సన్మానాలు జరిగాయని డాక్టర్ దివ్యమూర్తి తెలియజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్, తోటి ఉపాధ్యాయులు, అనసూయ, నాగబాబు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top